Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తేజ దర్శకత్వం లో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్.ఆ తర్వాత కృష్ణ వంశి దర్శకత్వంలో చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.తాజాగా కాజల్ గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.పెళ్లి తర్వాత కాజల్ హీరో బాలకృష్ణ కు జోడిగా భగవంత్ కేసరి అనే సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు.తమన్ సంగీతం అందించగా,శ్రీలీల కీలక పాత్రలో కనిపించారు.తాజాగా కొత్త ఇంట్లోకి వెళ్లిన కాజల్ తన నూతన గృహప్రవేశ ఫోటోలను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేసింది.కాజల్ తన భర్త,కుమారుడు నీల్ కిచ్లు తో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించింది.ఈమె సినిమాల గురించి చెప్పాలంటే ఔరం ఆర్ట్స్ నిర్మిస్తున్న కాజల్ 60 వ సినిమాకు సత్యభామ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
అరవై సినిమాలు పూర్తి చెయ్యడం ఈ రోజుల్లో మాములు విషయం కాదని చెప్పచ్చు.కాజల్ తెలుగుతో పాటు తమిళ్,హిందీ భాషలలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 మూవీ లో కాజల్ నటిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.కమల్ హాసన్ హీరో గా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కాజల్ కీలక పాత్రలో నటిస్తుంది.
View this post on Instagram