Home సినిమా క్యూట్ గా ఉన్న తన కొడుకు ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన కాజల్…వైరల్ అవుతున్న పిక్స్…

క్యూట్ గా ఉన్న తన కొడుకు ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన కాజల్…వైరల్ అవుతున్న పిక్స్…

0

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.మదర్స్ డే సందర్భంగా కాజల్ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసారు.తన బిడ్డను తన గుండెలపై పడుకోపెట్టుకుని దిగిన మధురమైన ఫోటోలను కాజల్ అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా రాసారు కాజల్.ప్రియమైన నీల్..నా మొదటి బిడ్డ..నువ్వు యెంత విలువైనవాడివి..ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటావని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని కాప్షన్ కాజల్ రాయడం జరిగింది.నిన్ను నేను నా చేతుల్లోకి తీసుకోని..నీ చిన్న చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.నీ వెచ్చని శ్వాసను అనుభవించాను..నీ అందమైన కళ్ళను చుసిన క్షణం…నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తుంటానని నీకు తెలుసు.

నువ్వు నా మొదటి సంతానం..నా మొదటి కొడుకు.బేసిక్ గా నువ్వే నా సర్వస్వము అంటూ కాజల్ పోస్ట్ లో తెలిపింది.రానున్న రోజుల్లో నేను నీకు చాల నేర్పించాల్సి ఉంది..అందుకు నా వంతు కృషి నేను చేస్తాను.కానీ నువ్వు ఇప్పటికే నాకు చాల నేర్పించావు,తల్లిగా ఎలా ఉంటుందో నువ్వు నాకు చెప్పావు.నాకు నిస్వార్ధంగా ఉండాలని నేర్పించావు.నా శరీరం వెలుపల నా హృదయం భాగాన్ని కలిగి ఉండటం సాధ్యమని నువ్వు తెలిసేలా చేసావు.ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాల ఉంది అంటూ కాజల్ రాసుకొచ్చారు.

kajal baby neel kichlu photos goes viral

తల్లి కావడం అంట ఈజీ కాదు..నేను ఫస్ట్ చాల భయంగా ఫీల్ అయ్యాను.కానీ ఇప్పుడు ఇది మరింత అందంగా ఫీల్ అయ్యేలా చేసింది.ఈ విషయాలన్నిటిలో నాకు మొదటి అనుభవం నీతోనే కలిగింది.ఇలా ఇంకెవరో చేయలేదు..ఆ భగవంతుడే నిన్ను నా చిన్న రాజకుమారుడిగా ఎన్నుకున్నాడు…అంటూ కాజల్ రాసుకొచ్చింది.నువ్వు బలంగా ఉండాలి..మధురంగా ఉండాలి…ఇతరుల కోసం నీకు హృదయం ఉండాలని నేను ప్రాద్ధిస్తున్నాను అంటూ కాజల్ తెలిపింది.

ఈ ప్రపంచంలో ని ఉజ్వల భవిష్యత్తు మరియు మనోహరమైన వ్యక్తిత్వం ఎప్పటికి మసకబారనివ్వకూడని నేను ప్రాద్ధిస్తున్నాను.నువ్వు ధైర్యంగా,దయగా,ఉదారంతో పాటుగా సహనంతో ఉండాలని నేను ప్రాద్ధిస్తున్నాను.నేను ఇప్పటికే నీలో చాల చూస్తున్నాను.నువ్వు నా బిడ్డ అని చెప్పుకోవడానికి చాల గర్వంగా ఫీల్ అవుతున్నాను.నువ్వు నా చిట్టి పొట్టి చిన్నారివి అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ రాసింది.

kajal baby neel kichlu photos goes viral

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here