హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే.ఇటీవలే కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలను ఇంస్టా లో షేర్ చేయడం జరిగింది.ఇప్పుడు తాజాగా జిమ్లో ట్రైనర్ సహాయంతో కసరత్తులు చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు కాజల్.అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు శరీరానికి ఎలాంటి కష్టం పెట్టకూడదు అని చాల మంది పెద్దలు చెప్తుంటారు.సాధారణ రోజుల్లో లాగానే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా వ్యాయామం చేస్తూ బాడీ ఫిట్ గా ఉండేలా చూసుకోవచ్చు అని ఈ తరం అమ్మాయిలు చెబుతుంటారు.ఇ
దే క్రమంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతిగా వ్యాయామం చేస్తున్న వీడియొ ను షేర్ చేస్తూ వ్యాయామం చేస్తున్న సమయంలో తీసుకోవలసిన సలహాలు,సూచనలతో కూడిన పెద్ద పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు.చిన్న చిన్న పాటి వర్కౌట్ లు,ఏరోబిక్స్ వంటివి సుఖ ప్రసవం కోసం చాల సహాయ పడతాయి.ప్రెగ్నెన్సీ కి ముందు ఇప్పుడు శరీరాన్ని మెరుగ్గా ఆరోగ్యంగా ఉంచడంలో కసరత్తులు సహాయ పడతాయి.ఇలా చేయడం వలన నా శరీరం బలంగా మారింది,శరీరాకృతి పరంగా ఫిట్ గా ఉండగలుగుతున్న అంటూ తన ట్రైనర్ తో కలిసి చేసిన వర్కౌట్ వీడియోలను కాజల్ తన ఇంస్టాగ్రామ్లో షేర్ చేసారు.