తెలుగులో కాంతారా సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది.ఈమె కర్ణాటక టూరిజం కోసం చేసిన ఒక వీడియొలో ఈమెను చూసినట్లు కాంతారా సినిమా యూనిట్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఆడిషన్స్ లో ఈమె పాల్గొన్న తర్వాత ఆ పాత్ర కోసం ఆమెను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయడం జరిగింది.అయితే ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో ఆమె మేకప్ మరియు డైలాగ్స్ మీద దర్శకుడు ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.
సప్తమి ఈ పాత్రలో నటించడానికి ముందు దర్శకుడు కొన్ని వర్క్ షాప్ లు నిర్వహించారు.ఆమెను ఈ పాత్ర కోసం ఫైనల్ చేయడానికి ముందు సినిమా ఫ్లోర్ మీదకు వెళ్ళడానికి ముందు కొన్ని వర్క్ షాప్ లు నిర్వహించడం జరిగింది.ఆ తర్వాత ఈ సినిమా ఫ్లోర్ మీదకు వెళ్లడం హిట్ అవ్వడం జరిగింది.
ఇక ఈ సినిమాలో ఆమె యెంత అద్భుతంగా నటించిందో అందరికి తెలిసిందే.అయితే ఇది ఇలా ఉంటె ఇటీవలే కాంతారా సినిమా హీరోయిన్ సప్తమి గౌడ తన అభిమానులతో కలిసి చేసిన డాన్స్ వీడియొ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.సాధారణంగా అయితే అభిమానులు తమ ఇష్టమైన హీరోయిన్ పాటకు డాన్స్ చేయడం సర్వసాధారణం.అయితే ఇక్కడ తమ ఇష్టమైన హీరోయిన్ తో కలిసి అభిమానులు చేయడంతో ఈ వీడియొ కాస్త వైరల్ గా మారింది.