ప్రముఖ ఓటిటీలోకి కాంతారా…క్లారిటీ ఇచ్చిన నిర్మాత…స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

Kantara Movie

Kantara: ఏ భాష సినిమానైనా కంటెంట్ బాగుంటే చాలు సినీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇందుకు తార్కాణమే కన్నడ డబ్బింగ్ మూవీ ‘కాంతార’. కన్నడ భాషలో చిన్న మూవీగా వచ్చిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం విపరీతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్, తదితర చిత్రాల కలెక్షన్లను కూడా బీట్ చేసిందంటే ఈ మూవీ గ్రేస్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. రిలీజ్ డేట్ నుంచి థియేటర్స్, సోషల్ మీడియా ప్రకటనలు, సినీ అభిమానుల నోట కాంతార చర్చే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ రోజు నుంచి థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ గానే ఉంటున్నాయి. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందీ మూవీ. 

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్. కలెక్షన్ల సునామీ దీని సొంతం. ఈ మూవీ ఓటీటీలకు ఎప్పుడు వస్తుందా.. అంటూ థియేటర్ లో చూసిన వారితో చూడని వారు కూడా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలోకి ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది (నవంబర్ 4వ తేదీ) అని రూమర్లు ఉన్న నేపథ్యంలో దీనిపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చింది. 

Kantara
Kantara

ఓటీటీ వేదికగా కాంతార రిలీజ్ ఎప్పుడు చేస్తామోనని చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘ఇటీవల సోషల్ మీడియాలో కాంతార ఓటీటీ రిలీజ్ డేట్‌పై రూమర్లు వస్తున్నాయని, ఇది వాస్తవం కాదని, ఈ విషయంపై చిత్ర యూనిట్ వివిధ మాధ్యమాలతో చర్చలు మాత్రమే జరుపుతుందని, త్వరలో క్లారిటీ ఇస్తామని’ చెప్పారు. దీంతో రూమర్లకు ఫుట్ స్టాప్ పడింది. ఈ మూవీ సృష్టిస్తున్న సెన్షేషన్ నేపథ్యంలో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *