డెలివరీ బాయ్ గా ఉన్న ఈ స్టార్ కమెడియన్ ఎవరో గుర్తుపట్టగలరా…


బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత,కమెడియన్ అయినా కపిల్ శర్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.పలు సినిమాలలో,షో లలో కమెడియన్ గా మెప్పించి అందరిని ఆకట్టుకున్నాడు కపిల్ శర్మ.ఆ తర్వాత కపిల్ శర్మ అనే కామెడీ షో ద్వారా కపిల్ శర్మ కు మంచి గుర్తింపు వచ్చింది.ఈ షో ద్వారా తన హాస్యంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఈ షో కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో డెలివరీ బాయ్ గెట్ అప్ లో రోడ్ మీద బైక్ నడుపుతున్నాడు కపిల్ శర్మ.

ఒక కంపెనీ కి సంబంధించిన పసుపు రంగు టి షర్ట్ ను కపిల్ శర్మ ధరించారు.అలాగే ఈ ఫొటోలో కపిల్ శర్మ వెనకాల బ్లూ కలర్ బ్యాగ్,చేతికి వాచ్ మరియు హెల్మెట్ పెట్టుకొని ఉండడటం గమనించవచ్చు.మాములుగా ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఇలా వెనుకాల బ్యాగ్ పెట్టుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం కపిల్ శర్మ తాను చేస్తున్న సినిమాలో భాగంగా ఇలా ఫ్యూఫ్ డెలివరీ బాయ్ గెట్ అప్ వేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.నందిత దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమాలో కపిల్ శర్మ జీవనోపాధి కోసం డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారని ఫోటో చూస్తే అర్ధమవుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగం గానే ఎవరో ఫోటో తీయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని తెలుస్తుంది.ఈ ఫోటో ను బాగా పరిశీలించినట్లయితే ఎడమ వైపు కారులో నుంచి కెమెరా కూడా `కనబడుతుంది.కెమెరాను ఆపరేట్ చేయడం కూడా గమనించవచ్చు.ఈ సినిమాలో సహన గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్నారు.పలు భాషలలో హీరోయిన్ గా చేసిన నందిత దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం అని చెప్పచ్చు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *