అదృష్టమంటే ఇతనిదే అని చెప్పచ్చు..రాత్రికి రాత్రే అకౌంట్ లో రూ. 2 కోట్ల రూపాయలు…ఎలానో తెలుసా…

ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లేట్ ఫార్మ్ డ్రీమ్ 11 గురించి చాల మందికి తెలిసే ఉంటుంది.ఈ డ్రీమ్ 11 ప్లేట్ ఫార్మ్ లో చాల మంది ఫాంటసీ టీం లను సృష్టించి తమ అదృష్టాన్ని పరీక్షిస్తూ ఉంటారు.ఈ క్రమంలో గత రెండేళ్లుగా ఐపీల్ లో ఫాంటసీ టీం లను సృష్టించి బెట్టింగ్ పెడుతున్న ఒక నిరుపేద యువకుడిని రాత్రి రాత్రే కోటీశ్వరుడిని చేసింది ఈ ప్లేట్ ఫార్మ్.వివరంగా చెప్పాలంటే…జమ్మూ కాశ్మీర్ లో బీజ్ బెహరా లోని షల్ గాం ప్రాంతానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రాత్రికి రాత్రే రూ.2 కోట్లు గెలుచుకున్నాడు.

ఇతను గత  రెండేళ్లుగా డ్రీమ్ 11 లో క్రికెట్,ఫుట్ బాల్,హాకీ,బాస్కెట్ బాల్ లో బెట్టింగ్ పెడుతున్నాడు.ఈ క్రమంలో శనివారం కూడా ఎంపిక చేసుకున్న ఇతని జట్టు మొదటి స్థానంలో నిలిచింది.ఈ విషయాన్నీ తన స్నేహితుడు శనివారం రోజు రాత్రి తనకు ఫోన్ చేసి చెప్పాడని,ఉదయం నిద్రలేచి చూసే సరికి రెండు కోట్లు గెలుచుకున్నట్లు ఉందని,అంతా కలలాగా ఉందని చెప్పుకొచ్చాడు వసీం.

మాది నిరుపేద కుటుంబం,ఈ డబ్బుతో మా పరిస్థితి మారుతుంది.15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మ కు మెరుగైన చికిత్స చేయిస్తా అంటూ వసీం చెప్పుకొచ్చాడు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అందరు వసీం రాజాను అభినందిస్తున్నారు.ఈ వార్త విని ఆ గ్రామంలో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ డ్రీమ్ 11 అనేది ఒక ఫాంటసీ క్రికెట్,హాకీ,ఫుట్ బాల్,కబడ్డీ,బాస్కెట్ బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతించే భారతీయ ఫాంటసీ క్రీడా వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *