Home » సినిమా » చిన్ననాటి ఫోటోలో క్యూట్ స్మైల్ తో ఉన్న నేషనల్ అవార్డు పొందిన ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా….

చిన్ననాటి ఫోటోలో క్యూట్ స్మైల్ తో ఉన్న నేషనల్ అవార్డు పొందిన ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా….

ఇటీవలే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు నటి నటుల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోలు,మూవీ అప్ డేట్స్ ఇలా ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా సినీ తారల చిన్ననాటి ఫోటోలు చూడడానికి అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తారు.ఈ క్రమంలోనే దాదాపుగా సౌత్ సినిమా హీరోయిన్ల అందరి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు ప్రస్తుతం క్యూట్ గా ఎంతో చక్కగా ఉన్న ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా కట్టిపడేసిన హీరోయిన్ కీర్తి సురేష్.రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కీర్తి సురేష్.మొదటి సినిమాతోనే హిట్ అందుకొని వరుసగా సినిమా అవకాశాలను కొట్టేసింది.ఆ తర్వాత మహానటి చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది కీర్తి సురేష్.ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది.

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది.పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ప్రస్తుతం కీర్తి సురేష్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ అనే చిత్రంలో నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *