ప్రతి మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలో నాయకుడు వెనుక ఉండే శిష్యుడు ఒకడు నాయకుడిని ఖచ్చితంగా మోసం చేస్తాడు.గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు చాల వరకు ఇలానే ఉన్నాయి అని చెప్పచ్చు.అయితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా కూడా ఇలానే ఉండబోతుందా అని చాల మందికి ఉన్న అనుమానం.అయితే పుష్ప మొదటి భాగంలో మాత్రం అలాంటిది ఏమి కనిపించలేదు.కానీ పుష్ప రెండవ భాగంలో మాత్రం అలాంటి సీన్ ఒకటి ఉంటుందని ఆ శిష్యుడు కేశవే అని వార్తలు వినిపిస్తున్నాయి.పుష్ప మొదటి భాగంలో ఒకరి దగ్గర పని చేసే కేశవ పుష్ప యాటిట్యూడ్ చూసి అతని దగ్గరకు వచ్చేసి అతని వెంటే తిరుగుతూ ఉంటాడు.
అయితే ఆ పాత్రలో మెలిక ఉందని రెండవ భాగంలో ఆ పాత్ర మెయిన్ కాబోతుంది అనే వార్త చాల రోజుల నుంచి వినిపిస్తుంది.ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వార్తను నిజం చేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కేశవ మేడలో గొలుసు,ఆ లుక్,హెయిర్ కట్ అచ్చమ్ అన్ని కూడా పుష్ప లాగే ఉన్నాయి.
అయితే కేశవ ట్రాస్ఫార్మేషన్ సినిమా ఇంటర్వెల్ లో జరుగుతుందా..లేదా సినిమా ఆఖరులో కేశవ ఇలా మారిపోయి పుష్ప కు షాక్ ఇస్తాడా అనేది అందరికి తెలియడం లేదు.ఇలాంటి సినిమాలలో పక్కన ఉండేవాళ్ళు షాక్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు అని చెప్పచ్చు.నేను నాయకుడి వెనుక ఉండటం కాదు,నేనే నాయకుడిని అని అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు.లేదంటే సినిమా చివరలో పుష్ప మంచి వాడిలా మారిపోతే నేనే పుష్ప అని కేశవ అంటాడేమో వేచి చూడాల్సిందే.సినిమాలో ట్విస్టులు అంటే సుకుమార్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.ఇప్పుడు పుష్ప విషయంలోనూ సుకుమార్ అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటారు అని చాల మంది అభిప్రాయపడుతున్నారు.