మరో రికార్డ్ బ్రేక్ చేసిన కెజిఎఫ్ 2 …25 రోజుల కలెక్షన్స్ ఇవే…

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్.ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కెజిఎఫ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో ప్రేక్షకులలో కెజిఎఫ్ రెండవ భాగం మీద భారీగానే అంచనాలు నెలకొన్నాయి.అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి రోజుకో రికార్డును బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.ప్రస్తుతం 2022 సంవత్సరంలో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది.ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఓ రేంజ్ లో వసూళ్లను సాధించింది.ఈ సినిమా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ లైఫ్ టైం కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ప్రస్తుతం రికార్డులకు ఎక్కింది ఈ చిత్రం.భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ సినిమాలు ట్రిపుల్ ఆర్ మరియు కెజిఎఫ్ 2 సినిమాలు సంచలనం సృష్టించాయి.హిందీలో ట్రిపుల్ ఆర్ సినిమా రూ 260 కోట్లు వసూలు చేస్తే కెజిఎఫ్ 2 రూ 400 కోట్లు రాబట్టి ఇప్పటికి కలెక్షన్ల పరంగా కొనసాగుతూనే ఉంది.ఇక 26 వ రోజున రూ 4 .60 కోట్లు రాబట్టింది.సొంత రాష్ట్రంలో కొంత వెనుకబడిన ఇతర ఏరియాలలో దుమ్ము దులుపుతూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది.ఈ చిత్రం ఈ రేంజ్ లో సక్సెస్ అవడానికి వెనుక నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

బి టౌన్ లో ఈ సంవత్సరం ట్రిపుల్ ఆర్ కంటే అధిక వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. కర్ణాటక లో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక తాజాగా అమిర్ ఖాన్ దంగల్ లైఫ్ టైం ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను దాటి సంచలనం క్రియేట్ చేసింది.ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏపీ లో కేవలం ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు.తెలుగులో డబ్బింగ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా రికార్డులకు ఎక్కింది.ఇప్పటి వరకు ఈ చిత్రం రూ 83 .08 కోట్ల షేర్లు రాబట్టింది.ప్రపంచవ్యాప్తం గా రూ 607 .86 కోట్ల షేర్లు రాబట్టి ట్రిపుల్ ఆర్ సినిమా లైఫ్ టైం గ్రాస్ వసూళ్లను సాధించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *