కెజిఎఫ్ లో హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించిన కుర్రాడు ఎవరో తెలుసా…

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.ఈ సినిమాలో హీరో యష్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ చిత్రంలో హీరో యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ చిత్రాలలో సరిపోలుస్తున్నారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అయినా సంజయ్ దత్,రవీనా టాండన్ కీలక పాత్రలలో కనిపించడం జరిగింది.అయితే ఈ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించిన కుర్రాడు గురించి చాల మందికి తెలీదు.

హీరో చిన్నప్పటి పాత్రలో అద్భుతంగా నటించినకుర్రాడు ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చాల కీలకం.కెజిఎఫ్ 2 హీరోపాత్రలో నటించిన టీనేజ్ కుర్రాడి పేరు అన్మోల్ విజయ్ భత్కల్.యంగ్ రాఖీ పాత్ర ఈ సినిమాలో చాల సార్లు ఫ్లాష్ బ్యాక్ లో కనిపించడం జరుగుతుంది.ప్రస్తుతం అన్మోల్ వయస్సు 18 సంవత్సరాలు.ప్రస్తుతం అన్మోల్ తన చదువుపాటి దృష్టి సారిస్తున్నాడు.అన్మోల్ కు డాన్స్ అంటే చాల ఇష్టం ఉండడంతో చిన్నప్పటి నుంచి డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

డాన్స్ తో పాటు స్టంట్స్,కఠినమైన వర్క్ అవుట్ లు చేయడం కూడా అన్మోల్ కు చాల ఇష్టం.సోషల్ మీడియా వేదికగా అన్మోల్ తన స్టంట్స్కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు.ఈ సినిమాలో అతని పాత్ర చిన్నదే అయినా కూడా ఈ సినిమాకు ఆ పాత్ర ఆత్మా లాంటిదని చెప్పచ్చు.సినిమాలో ఈ పాత్ర అత్యంత ధనవంతులుగా,అత్యంత శక్తి వంతులుగా మార్చడానికి పదే పదే ప్రేరేపిస్తుంది.అన్మోల్ కి యంగ్ రాఖి షాట్ల కోసం 12 నెలలు పట్టిందట.అన్మోల్ కన్నడ చిత్రం అయినా పడకలో కూడా నటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *