కె.జి.యఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఇటీవలే మొదటి భాగం కు సీక్వెల్ గా కె.జి.యఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.సొంత రాష్ట్రం అయినా కర్ణాటక తో పాటు నార్త్,సౌత్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఈ చిత్రంలో తల్లి పాత్ర కీలక పాత్ర పోషించటం జరిగింది.సినిమాలో రాఖి భాయ్ కి తల్లిగా చేసిన అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.ఆ అమ్మయి పేరు అర్చన జోస్.ఆమె బెంగళూరు లో 1994 జన్మించారు.అర్చన కర్ణాటక లోని బెంగళూరు లో న్యూ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి అక్కడే నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది.
అలాగే అర్చన జోస్ తమిళనాడు లోని తంజావూరు లో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును పూర్తి చేసారు.అర్చన మహాదేవి అనే కన్నడ సీరియల్ తో తొలిసారిగా నటించారు.ఈ సీరియల్ జి కన్నడ లో ప్రసారం అయ్యేది.ఈ సీరియల్ లో ఆమె సుందరి పాత్రలో కనిపించి నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత అర్చన కన్నడ చిత్రం కె.జి.యఫ్ లో హీరో యష్ కు తల్లిగా నటించి తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు.27 ఏళ్ళ అర్చన ఈ సినిమాలో హీరో తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చిన్న వయస్సులో ప్రముఖ హీరోకు తల్లిగా అద్భుతంగా నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు.ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లో 546 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డులను క్రియేట్ చేస్తుంది.ఈ సినిమాతో హీరో యష్ కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.మూడు సంవత్సరాల క్రితం కన్నడ స్టార్ హీరో గా ఉన్న యష్ ను ఈ చిత్రం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చి పెట్టింది.