50 ఏళ్ళ వయస్సులో 26 ఏళ్ళ అమ్మాయిగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా…


ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇప్పటి సినిమాలలో సహాయ నటి పాత్రలలో నటిస్తున్నారు.ఈమె రాజకీయాలలో కూడా కొనసాగుతూ తెలుగు తమిళ్ సినిమాలలో వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే.ఒకప్పుడు కుష్బూ తన అందంతో నటనతో కుర్రాళ్ళ కళల రాకుమారిగా కొనసాగింది.ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు అనే చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.వెంకటేష్ హీరోగా ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున,త్రిమూర్తులు,భారతంలో అర్జునుడు,కిరాయి దాదా,మరణ హోమం,చిన్నోడు పెద్దోడు,శాంతి క్రాంతి,పేకాట పాపారావు,స్టాలిన్,యమదొంగ,కథానాయకుడు,అజ్ఞతవాసి,ఆడవాళ్ళూ మీకు జోహార్లు వంటి పలు హిట్ సినిమాలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు.అయితే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఖుష్బూ బొద్దుగా మారిన సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఖుష్బూ బరువు తగ్గి సన్నగా మారిపోయిన లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఖుష్బూ సన్నగా మారిపోయి అందరికి షాక్ ఇచ్చింది.ఖుష్బూ ఏకంగా 18 కిలోల బరువు తగ్గిందట.హీరోయిన్ గా ఉన్నప్పటి కంటే కూడా ఖుష్బూ ఇప్పుడు యంగ్ గా ఎంతో అందంగా కనిపిస్తుంది.ఖుష్బూ లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు సీనియర్ హీరోలకు జోడిగా చేస్తే బాగుంటుంది మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *