Bhumika Chawla: పవన్ కళ్యాణ్,ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏడవ చిత్రంగా తెరకెక్కిన ఖుషి చిత్రం రూ.30 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి.ఒక్క నడుము సీన్ తో కథ మలుపు తిరగడం అనేది అప్పట్లో బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పచ్చు.చాల ఏరియాల్లో ఈ చిత్రం సెకండ్ రిలీజ్ అయ్యి భారీగా వసూళ్లను కూడా రాబట్టింది.
ఖుషి సినిమాలో భూమిక తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత అవకాశాలు ఆమెకు క్యూ కట్టాయి.ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఒక్కడు మరియు ఎన్టీఆర్ హీరోగా చేసిన సింహాద్రి చిత్రాలు భూమిక కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలను తగ్గించిన భూమిక మల్లి కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు.
ఇదివరకు భూమిక గ్లామర్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయగా ప్రస్తుతం భూమిక చేసిన డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియొ లో భూమిక ఖుషి సినిమాలోని అమ్మాయే సన్నగా అనే పాటకు అవే స్టెప్పులు వేస్తూ ఫుల్ గ్రేస్ తో డాన్స్ చేసింది.ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 21 సంవత్సరాలు అయినా కూడా భూమికలో అదే ఫిజిక్ అదే గ్రేస్ ఉండడం విశేషం.తాజాగా భూమిక చేసిన ఈ డాన్స్ వీడియొ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.