మనిషి శరీరంలో ఉన్న అన్ని అవయవాలలో కిడ్నీలు కూడా ముఖ్య అవయవం.శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపించడంలో కిడ్నీ లు బాగా పని చేస్తాయి.కానీ ప్రస్తుతం ఉన్న ఆహార అలవాట్లకు గాను,పని వత్తిడికి గాను వయస్సుతో సంబంధం లేకుండా చాల మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో కిడ్నీ కి సంబంధించిన సమస్య కూడా ఒకటి.ఎల్లప్పుడూ ఆరోగ్యమైన ఆహారం మరియు నీరు బాగా తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్ళూ,కిడ్నీ ఇన్ఫెక్షన్లు,కిడ్నీ కాన్సర్,కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో చాల మంది బాధపడుతున్నారు.
అయితే శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉన్న కూడా కిడ్నీలో రాళ్ళూ ఏర్పడే అవకాశం ఉంటుంది.ఒకవేళ కిడ్నీ లో రాళ్ళూ కనుక ఉంటె ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది.అలా కిడ్నీ కి సంబంధించిన ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.అలాగే పొట్టి కడుపు లేక వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉన్న కూడా కిడ్నీ లో రాళ్ళూ ఉండే అవకాశం ఉంది.మూత్రంలో మంట ఉన్న లేక రక్తం పడిన కూడా కిడ్నీ సమస్య అయ్యే అవకాశం ఉంది.
కిడ్నీలో సమస్యలకు చెక్ పెట్టాలంటే శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.అలాగే విత్తనాలు ఉన్న కూరగాయలు కానీ పండ్లు కానీ వీలైనంత తక్కువగా తీసుకోవాలి.తులసి తీసుకోవడం వలన కూడా కిడ్నీ లో రాళ్ల సమస్య ఏదైనా ఉంటె అది దూరమవుతుంది.సమయం దొరికినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగడం,కాషాయం వంటివి చేసుకొని తాగడం వలన కూడా కిడ్నీలో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అలాగే ఉల్లిపాయను పచ్చిగా తినడం,ఉల్లిపాయ రసం తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల సమస్య దూరం అవుతుంది.