Kiraak RP Marriage: గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ…పెళ్లి ఫోటోలు వైరల్

NEWS DESK
1 Min Read
Kiraak RP Marriage

Kiraak RP Marriage: జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.జబర్దస్త్ కామెడీ షో లో తనదైన స్టైల్ లో కామెడీ పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కిరాక్ ఆర్పీ.జబర్దస్త్ తర్వాత అదిరింది,కామెడీ స్టార్స్ వంటి షో లలో కూడా పాల్గొన్నాడు.ఆ తర్వాత కిరాక్ ఆర్పీ నెల్లూరు వారి చేపల పులుసు కర్రీ పాయింట్ ను స్టార్ట్ చేసి మరింత ఫేమస్ అయ్యాడు అని చెప్పచ్చు.

తాజాగా కిరాక్ ఆర్పీ పెళ్లి చేసుకున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.తాజాగా కిరాక్ పెళ్లి తానూ ప్రేమించిన లక్ష్మి ప్రసన్న ను వైజాగ్ లో పెళ్లి చేసుకున్నాడు.వీరి పెళ్ళికి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు,స్నేహితులు హాజరు అయ్యారు.పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి పెళ్ళిలో సందడి చేసారు.

Kiraak RP Marriage
Kiraak RP Marriage

వైజాగ్ బీచ్ కి అతి దగ్గరలో ఉన్న పెళ్లి మండపంలో వీరి పెళ్లి జరిగినట్లు కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.ఇక ఏడాది క్రితమే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు చెప్పుకొచ్చాడు కిరాక్ ఆర్పీ.జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వీరి పెళ్ళిలో హాజరయ్యారు.ఆర్ సి రెడ్డి కోచింగ్ సెంటర్ లో సివిల్స్ కోసం జాయిన్ అయినా లక్ష్మి ప్రసన్నను చూసి తోలి చూపులోనే కిరాక్ ఆర్పీ ప్రేమలో పడ్డాడు.మొత్తానికి వీరిద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు అని తెలుస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *