Home » సినిమా » లుంగీ కట్టి మాస్ డాన్స్ తో అదరకొట్టిన హీరోయిన్ కీర్తి సురేష్…వీడియొ వైరల్…

లుంగీ కట్టి మాస్ డాన్స్ తో అదరకొట్టిన హీరోయిన్ కీర్తి సురేష్…వీడియొ వైరల్…

టాలీవుడ్ లో తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.ఈమె చేసిందే తక్కువ సినిమాలే అయినా కూడా మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.మహానటి సినిమాలో ఈమె నటనకు దేశం మొత్తం ఫిదా అయ్యిందని చెప్పచ్చు.ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ అవార్డు కూడా లభించింది.హీరో నాని కు జోడిగా ఈమె నేను లోకల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.నేను లోకల్ తర్వాత మల్లి నాని కు జోడిగా దసరా సినిమాలో కనిపించనుంది ఈ అమ్మడు.

విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో నాని పూర్తిగా డి గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు.సింగరేణి నేపథ్యంలో ఈ కథ తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈమె చేతిలో ఈ ఒక్క సినిమానే ఉందని చెప్పచ్చు.మరోపక్క కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా నటిస్తున్నారు.ఈమె తమిళ్ సినిమా లో కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్నా దసరా సినిమా ప్రమోషన్స్ లో చాల ఆక్టివ్ గా పాల్గొంటుంది కీర్తి.

ఈ సినిమాలోని పాటకు బటన్స్ విప్పేసి,లుంగీ కట్టి మరీ ఈమె చేసిన డాన్స్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.ఈమె చేసిన రచ్చకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఒక్కప్పుడు చాల పద్దతిగా కనిపించే కీర్తి ఇప్పుడు ఇంతలా రచ్చ చేస్తుందని చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం కీర్తి సురేష్ స్లిమ్ గా మారి గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తుంది.అయితే ఈమెకు సంబంధించి లేటెస్ట్ వీడియొ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *