Home సినిమా ఒకే కథతో తో వచ్చిన కృష్ణ,మహేష్ బాబు సినిమాలు యేవో తెలుసా…ఇంతకీ ఏది హిట్ అయ్యిందంటే..

ఒకే కథతో తో వచ్చిన కృష్ణ,మహేష్ బాబు సినిమాలు యేవో తెలుసా…ఇంతకీ ఏది హిట్ అయ్యిందంటే..

0

సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఒకే టైటిల్ తో వచ్చిన తండ్రి కొడుకుల సినిమాలు చాలానే ఉన్నాయి.కానీ దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల సినిమా ఇది ఒక్కటే అని చెప్పచ్చు.మహేష్ బాబు,కొరటాల శివ దర్శకత్వంలో,మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం శ్రీమంతుడు.2015 లో రిలీజ్ అయినా ఈ చిత్రంలో మహేష్ బాబు,శృతి హాసన్ జంటగా నటించారు.ఈ చిత్రం ఊరికోసం హీరో తన ప్రేమను,కోట్ల రూపాయల ఆస్తిని పక్కన పెట్టి దేవరకోట ఊరిని దత్తత తీసుకుంటాడు.ఆ ఊరిలో ఎంపీ మరియు అతని సోదరుడు చేసే అక్రమాలను ఎదురు కొని చివరకు ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు కొరటాల శివ.

కామెరిసిల్ హంగులతో సందేశాత్మకంగా తెరకెక్కబడిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.గ్రామాలను దత్తత తీసుకోవడం అనేది ఈ సినిమా ప్రభావంతో మొదలైందని చెప్పచ్చు.దాదాపుగా ఈ స్టోరీ కి దగ్గరలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రామరాజ్యంలో భీమా రాజు అనే స్టోరీ ఉంటుంది అని చెప్పచ్చు.ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో కృష్ణ గారికి జోడిగా శ్రీదేవి నటించారు.లంకా నగరం అనే గ్రామంలో రామరాజు అనే పెద్దమనిషి కార్మికులను పీడిస్తూ ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు.

అదే సమయంలో ఊరిలోకి వచ్చిన భీమా రాజు హీరోయిన్ ను ప్రేమించడం జరుగుతుంది.విలన్ చేసే ఆకృత్యాలకు బీమారాజు అడ్డుపడుతూ ఉంటాడు.అయితే చివరలో భీమరాజు కోటీశ్వరుడని,కోట్ల ఆస్తిని కాదనుకొని ఇక్కడకు వచ్చాడని భీమరాజు తండ్రి చెప్పడం జరుగుతుంది.చివరకు హీరో విలన్ కు బుద్ధి చెప్పి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు.దాదాపుగా దగ్గర కథతో వచ్చిన కృష్ణ,మహేష్ బాబు రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here