Home సినిమా Krithi Shetty Dance: బెల్లీ డాన్స్ తో అదరగొట్టేసిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి…వీడియొ వైరల్

Krithi Shetty Dance: బెల్లీ డాన్స్ తో అదరగొట్టేసిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి…వీడియొ వైరల్

0
Krithi Shetty Dance
Krithi Shetty Dance

Krithi Shetty Dance: ఉప్పెన లా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయింది ఈ అమ్మడు.ఇక ఉప్పెన సినిమా విజయం తర్వాత కృతి శెట్టి(Krithi Shetty) కి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.అవకాశాలు చాలానే వచ్చిన ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు అని చెప్పచ్చు.కృతి శెట్టి నటించిన సినిమాలలో బంగార్రాజు,శామ్ సింగ రాయి సినిమాలు మాత్రమే విజయం సాధించాయి.

ఇక కృతి శెట్టి నితిన్ తో మాచర్ల నియోజక వర్గం,రామ్ పోతినేని తో వారియర్,నాగ చైతన్య తో కస్టడీ సినిమాలలో నటించిన అవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి.దాంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు తెలుగు సినిమాలు మరియు మలయాళంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తుంది.తమిళ్,కన్నడ,మలయాళం లో కృతి శెట్టి కి అవకాశాలు బాగానే వస్తున్నాయి.కృతి శెట్టి సోషల్ మీడియా లో బాగా ఆక్టివ్ గా ఉంటుంది.

[irp posts=”7905″ ]

Krithi Shetty Dance
Krithi Shetty Dance

ఎప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసే కృతి శెట్టి ఈసారి తానూ చేసిన బెల్లి డాన్స్ వీడియొ ను షేర్ చేసింది.తన స్నేహితురాలి తో కలిసి కృతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ పాటకు నడుమును ఊపుతూ బెల్లి డాన్స్ చేసింది.సింపుల్ స్టెప్స్ తో బెల్లి డాన్స్ చేసి కృతి శెట్టి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ప్రస్తుతం కృతి శెట్టి షేర్ చేసిన ఈ వీడియొ సోషల్ మీడియా లో అందరిని ఆకట్టుకుంటుంది.ఈ వీడియోను చుసిన నెటిజన్లు బీబమ్మ బెల్లి డాన్స్ కు ఫిదా అవుతున్నారు.ఇక కృతి ప్రస్తుతం శర్వా నంద్ కు జోడిగా ఒక సినిమాలో నటిస్తుంది.అలాగే తమిళ్ లో నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో ప్రదీప్ రంగనాథ్ కు జోడిగా నటిస్తుంది.

krithi shetty instagram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here