- సినిమా

ప్రస్తుతం యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా…

ఈ మధ్యకాలంలో చాల మంది హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ దర్శనం ఇస్తూనే ఉన్నాయి.తాజాగా టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరు అయినా కృతి శెట్టి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.క్యూట్ స్మైల్ తో ముద్దుగా ఉన్న కృతి శెట్టి ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ అమ్మడు వైష్ణవ తేజ్ కు జోడిగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని కు జోడిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించి మరొక హిట్ అందుకుంది.అలాగే నాగచైతన్య కు జోడిగా బంగార్రాజు చిత్రంలో నటించి సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం కృతి శెట్టి తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ది వారియర్ చిత్రంలో హీరో రామ్ పోతినేనికి జోడిగా నటిస్తుంది.తెలుగు,తమిళ్ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇటీవలే ఈ చిత్రం లో హీరో రామ్ లుక్ ఒకటి రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకుంది.రామ్ ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి కి అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.భారీ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి కి ఆఫర్ వచ్చినట్టు సమాచారం.ఈ సినిమాకు ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో తెలుగు లో ఫుల్ బిజీ గా ఉంది ఈ అమ్మడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *