తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి.తన అందంతో,అభినయంతో మొదటి చిత్రం తోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు సినిమా అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.ఇటీవలే కృతి శెట్టి నటించిన బంగార్రాజు,శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.వరుస సినిమా అవకాశాలతో కృతి శెట్టి ప్రస్తుతం బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కు జోడిగా ది వారియర్ చిత్రంలో నటిస్తున్నారు.లింగుస్వామి దర్శకత్వం వచించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
తెలుగు,తమిళ్ బాషలలో ఈ చిత్రం జులై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి.ఈ సినిమా ప్రమోషన్ లో భాగం గా కృతి శెట్టి తాజాగా బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్నారు.దీనికంటే ముందు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు కృతి శెట్టి.ఈమెను ప్రాంక్ స్టార్లు అయినా ఆషిక్,సారథిరన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.కృతి శెట్టికి ముందు ప్రశ్నలు తాను అడగాలంటే తానూ అడగాలి అంటూ వీరిద్దరూ ఆమె ముందు పెద్ద ఎత్తున గొడవ పడ్డారు.
సారథిరన్ ఆషిక్ పై చేయి కూడా చేసుకోవడం జరిగింది.వీరిద్దరూ ఇలా పెద్ద ఎత్తున గొడవ పడుతుండడంతో ఎంతో ఆందోళనకు లోనై కృతి శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు.ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వీరిద్దరూ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే అని చెప్పి మల్లి కృతి శెట్టిని నవ్వించారు.ఎందుకు ఏడ్చారు అని కృతి శెట్టిని అడిగినప్పుడు..ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు..భయం వేస్తుంది అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.