కూతురితో కలిసి సురేఖ వాణి చేసిన డాన్స్ వీడియొ వైరల్…

ఇటీవలే కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ లో నటి నటులు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు కూడా ఆక్టివ్ గా ఉంటున్నారు.ఇదివరకు రోజుల్లో క్యారక్టర్ ఆర్టిస్టులను వాళ్ళ సినిమాలతో మాత్రమే గుర్తించేవారు.కానీ ఇప్పటి రోజుల్లో క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.లేడీ క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు చాల ఆక్టివ్ గా ఉంటూ నటి సురేఖ వాని ఆ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది అని చెప్పచ్చు.గత కొన్ని రోజుల నుంచి సురేఖ వాణి,ఆమె కూతురు ఇంస్టాగ్రామ్లో చాల యాక్టీవ్గా ఉంటున్నారు.ఇటీవలే సురేఖ వాణి కూతురు సుప్రీతా తో కలిసి చేసిన డాన్స్ వీడియొ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు కూడా పొట్టి డ్రెస్సుల్లో మంచి స్టెప్పులు వేస్తూ అందరిని బాగా మెప్పించారు.

ఈ వీడియొ చూసిన నెటిజన్లు తల్లి కూతురు లాగా లేరని అక్క చెల్లెలి లాగ ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా సినిమాల్లోకి రానుందని ఇదివరకు చాల వార్తలు వినిపించాయి.దీనికి సంబంధించి సుప్రీతా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒకవేళ తీసుకుంటే తన నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని సురేఖ వాణి తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *