లక్ష్మిదేవి ఇంట్లో నిలువ ఉండాలంటే ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు..

మనిషి జీవితం సాఫీగా కొనసాగాలి అంటే డబ్బు చాల అవసరం.జీవితంలో చేసే ప్రతి పని కూడా డబ్బుతో ముడి పడి ఉంటుంది.అయితే కొంత మంది యెంత కష్టపడి యెంత డబ్బులు సంపాదించినా కూడా ఇంట్లో ధనం నిలువ ఉండదు.వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లో ఏవైనా తప్పులు ఉన్న లేక దోషాలు ఉన్న ఆ ఇంట్లో ఉండే వాళ్లకు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి.అలాగే ఇంట్లో కానీ లేక పని చేసే వ్యాపార కార్యాలయంలో కానీ మురికి గా ఉంటె అక్కడ ధనలక్ష్మి కటాక్షం ఉండదు అని నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మి దేవి ఎప్పుడు కూడా శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది.వాస్తు ప్రకారం ఇంట్లో చెప్పులు సరైన ప్రదేశంలో మాత్రమే విడవాలి.ఇంట్లో ఎక్కడపడితే అక్కడ,పూజ గది దగ్గర చెప్పులను విడవకూడదు.చెప్పులను ఎప్పుడు కూడా సరైన ప్రదేశంలో ఉంచితే మంచిది అని చెప్తున్నారు నిపుణులు.అలాగే బహిరంగ ప్రదేశాలలో చీపురును కూడా ఉంచకూడదు అని చెప్తున్నారు.

చీపురును ఎవరు పడితే వారు కూడా తాకకూడదు అని సూచిస్తున్నారు నిపుణులు.చీపురును ఎప్పుడు ఇంట్లో సరైన ప్రదేశములో ఉంచితే మంచిది.అలాగే పాడైపోయిన కుళాయిలు కానీ గడియారాలు కానీ ఇంట్లో ఉంచుకోకూడదు.పాడైపోయిన వస్తువులు ఏవైనా ఉంటె అవి నెగటివ్ ఎనర్జీ ని క్రియేట్ చేస్తాయి కాబట్టి వాస్తు దోషాలను కలిగిస్తాయి.అలాగే ఇంట్లో మనిషి బయటకు వెళ్లి వచ్చేటప్పుడు చేతిలో ఏదో ఒకటి ఉండాలి.అలా చేయకపోతే సంపద పెరగడానికి బదులు తిరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *