Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తో మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది.వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ జూన్ 9 న నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి కి రెడీ అయ్యారు.వీరిద్దరి నిశ్చితార్ధం వేడుకలో కొద్దీ మంది బంధువులు మిత్రులు హాజరయ్యారు.వీరిద్దరి నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి హాట్ టాపిక్ గా మారారు.
ఇక వీరిద్దరి పెళ్లి ఈ ఏడాది చివరలో రాజస్థాన్లోని పాలస్ లో జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.కట్నం వద్దని వరుణ్ తేజ్ చెప్పిన కూడా లావణ్య త్రిపాఠి తల్లితండ్రులు భారీ స్థాయిలో వరుణ్ తేజ్ కు కట్నం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగుపెట్టడానికి వరుణ్ తేజ్ కు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి అందరికి తెలిసిందే.కుటుంబ గౌరవానికి ఇబ్బంది కలగకుండా పెళ్లి తర్వాత సినిమాలలో నటించకుండా నిర్మాణ రంగంలో అడుగుపెడతానని లావణ్య త్రిపాఠి కండిషన్ పెట్టినట్లు సమాచారం.తనకు ఇష్టమైన భరతనాట్యం కోసం స్టేజి షో లు చేస్తానని ఆమె కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.ఈమె పెట్టిన కండిషన్స్ కు వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.