అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్న ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుప్పట్టగలరా…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ బాగా కొనసాగుతుంది.నటి నటులు గురువారం వచ్చిందంటే చాల తమ చిన్ననాటి ఫోటోలను వాటితో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇదే క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా చాల మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్ల ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో బాగా కనువిందు చేసాయి.సెలెబ్రెటీలు వాళ్ళ చిన్ననాటి ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆలస్యం వాళ్ళ అభిమానులు క్షణాల్లో షేర్లు చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

తాజాగా ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫొటోలో ఆ చిన్నారి లిప్ స్టిక్ వేసుకుంటూ క్యూట్ గా తన అందాన్ని అద్దంలో చూసుకుంటుంది.ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షాలిని పాండే.విజయ్ దేవరకొండ హీరోకు జోడిగా నటించి అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.

మొదటి సినిమా తోనే తన అందంతో,నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత కూడా 118 ,100 % కాదల్,నిశ్శబ్దం వంటి తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.ఇప్పుడు ప్రస్తుతం షాలిని పాండే హిందీ లో రెండు సినిమాలు చేస్తుంది.అందులో జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా మహారాజ అనే చిత్రం షూటింగ్ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *