38 సెకండ్లలో 75 జిల్లాల పేర్లు చెప్పిన చిన్నారి…వీడియొ వైరల్

చిన్నారులు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటుతున్న వీడియోలు చాలానే ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉన్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక చిన్నారి 38 సెకండ్ లలో 75 జిల్లాల పేర్లను చెప్పిన వీడియొ సోషల్ మీడియా లో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అక్షరక్రమంలో ఈ చిన్నారి 75 జిల్లాల పేర్లను చెప్పిన వీడియొ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ వీడియొ ను చూసిన వాళ్ళందరూ చిన్నారి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు అని చెప్పచ్చు.ఇక ఆ చిన్నారిని ప్రశంసిస్తూ పిట్టా కొంచెం కూత ఘనం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మాన్వి చౌరాసియా ఆదర్శ్ ఉత్తరప్రదేశ్ లోని డియోరియాలో ప్రాథమిక విద్యాలయ పాఠశాలలో చదువుతుంది.ఆ చిన్నారి ఏ తరగతి చదువుతుందో తెలియదు కానీ ఆ చిన్నారి ఇటీవలే 75 జిల్లాల పేర్లను అక్షరక్రమంలో చాల అవలీలగా చెప్పేసింది.అది కూడా ఈ చిన్నారి 38 సెకండ్ లలో చెప్పేసింది.ఈ చిన్నారి వీడియొ ను శుభంకర్ మిశ్రా అనే యూసర్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది.

అమేజింగ్ గర్ల్…ఈ బాలిక నైపుణ్యానికి మీరు కూడా సెల్యూట్ చేస్తారు అంటూ ఈ వీడియోకు కాప్షన్ ఇచ్చారు.చాల వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియొ కు ఇప్పటి వరకు 26 .5 వేళా వ్యూస్ రావడం జరిగింది.ఈ చిన్నారికి చాల భవిష్యత్తు ఉంది..ఇంటెలిజెంట్ గర్ల్..అమ్మాయి చాల చురుకుగా ఉంది అంటూ యూసర్లు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *