మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు..ఏ నగరంలో ఎంతంటే..

LPG Gas Price

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చాయి.పెట్రోల్,డీజిల్,నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో మరో భారం పడిందని చెప్పచ్చు.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం జరిగింది.14 కిలో లు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ 3 .50 పైసలు అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ 8 పెరగడం జరిగింది.

ఢిల్లీ లో 14 .2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ 1003 చేరుకుందని సమాచారం.అలాగే ముంబై లో రూ 1002 .50 మరియు కోల్ కతా లో రూ 1029 కు చేరుకుందని సమాచారం.చెన్నై లో 1018 .5 రూ కు చేరుకుంది.ఈ నెలలో ఈ ధరలు పెరగడం ఇది రెండోసారి అని చెప్పచ్చు.ఆయిల్ కంపెనీ లు ఈ నెల మే ఏడవ తేదీన ఏకంగా రూ 50 రూపాయలు పెంచిన సంగతి అందరికి తెలిసిందే.

LPG Gas Price
LPG Gas Price

ప్రస్తుతం మల్లి డొమెస్టిక్ మరియు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేసాయి.కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో తాజాగా ఢిల్లీ లో సిలిండర్ ధర రూ 2354 గా ఉండడం జరిగింది.కోల్కతా లో 2454 రూ మరియు ముంబై లో 2507 రూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *