Maanas Marriage: గ్రాండ్ గా బిగ్ బాస్ ఫెమ్ మానస్ పెళ్లి…వైరల్ అవుతున్న ఫోటోలు

NEWS DESK
2 Min Read
Maanas Marriage

Maanas Marriage: బుల్లితెర స్టార్ నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మానస్ నాగుపల్లి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే ఇటీవలే మానస్ శ్రీజ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా నవంబర్ 22 బుధవారం రాత్రి మానస్ శ్రీజ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.విజయవాడ లోని మురళి రిసార్ట్ లో వీరిద్దరి పెళ్లి ఇరువురు కుటుంబ సభ్యులు,స్నేహితులు మధ్య ఘనంగా జరిగింది.

ఒక రోజు ముందు నుంచే మానస్ ఇంట్లో పెళ్లి వేడుక మొదలయ్యింది.మానస్,శ్రీజ పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.హల్దీ ఫంక్షన్ లో మానస్,శ్రీజ ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు చల్లుకున్నారు.ఆ తర్వాత అక్కడికి వచ్చిన బంధువులు,స్నేహితులు వారిద్దరికీ పసుపు రాసారు.

Maanas Marriage
Maanas Marriage

ఇక ఆ తర్వాత మానస్,శ్రీజ ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు.మానస్ తో పాటు బిగ్ బాస్ షో లో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా మానస్ పెళ్లి లో సందడి చేసారు.మానస్,శ్రీజ ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు,హల్దీ ఫంక్షన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు మానస్,శ్రీజ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక మానస్ గురించి చెప్పాలంటే మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించాడు.ఆ తర్వాత సినిమాలలో నటుడిగా కూడా చేసాడు.అయితే మానస్ కు సినిమాల కంటే టీవీ సీరియల్స్ ద్వారానే మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 లో పాల్గొన్న మానస్ కు మంచి గుర్తింపు లభించింది.ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ లో చేస్తున్న పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *