Home సినిమా Mahalakshmi: భర్త రవీంద్ర పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్మి…మీరే నా బలం అంటూ...

Mahalakshmi: భర్త రవీంద్ర పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్మి…మీరే నా బలం అంటూ వీడియొ వైరల్..

0
Mahalakshmi

Mahalakshmi: నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్ కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మి ల వివాహం జరిగి ఇప్పటి కి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది.అయితే వీరిద్దరి పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మీద ట్రోలింగ్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.దీనికి కారణం ఏంటో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహాలక్ష్మి చూడడానికి ఎంతో అందంగా నాజూగ్గా ఉంటుంది.ఇక ఆమె భర్త రవీంద్ర చంద్రశేఖరన్ భారీ కాయం తో ఉంటారు.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.పైగా వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడంతో వీరి పెళ్ళైన తరువాతి క్షణం నుంచే వీరి మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

డబ్బు కోసమే మహాలక్ష్మి రవీంద్ర ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమె మీద విమర్శలు కురిపించారు నెటిజన్లు.రవీంద్ర శరీరాకృతిపై కూడా నెటిజన్లు నెగటివ్ పోస్ట్లు కామెంట్స్ చేసారు.ఇక ఈ మధ్యకాలంలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.ఇక ఎప్పటికప్పుడు తమ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అన్యోన్యతను చాటుకొని అందరికి గట్టిగా బుద్ది చెప్తున్నారు ఈ జంట.

తాజాగా మహాలక్ష్మి తన భర్త రవీంద్ర పుట్టిన రోజు సందర్భంగా మర్చిపోలేని బహుమతిని తన భర్తకు ఇచ్చింది.ఆరు అడుగుల ఎట్టు ఉన్న రవీంద్ర ఫోటోను పెయింటింగ్ తో తీర్చిదిద్ది తన భర్త రవీంద్ర కు కానుకగా ఇచ్చింది మహాలక్ష్మి.ఈ గిఫ్ట్ ను తన భర్త కు ఇస్తూ మహాలక్ష్మి లైఫ్ లో నాకు మల్లి ధైర్యం నూరిపోసి మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.మిరే నా బలం..అందుకు నేను మీకు ఎప్పటికి కృతజ్ఞురాలిని..నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను.లవ్ యు ఫర్ ఎవర్ అంటూ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియొ చూసి నెటిజన్లు లవ్లీ కపుల్,అన్యోన్య దాంపత్య బంధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here