Home సినిమా ట్విట్టర్ లో మహేష్ బాబు ఎవరిని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారో తెలుసా…!

ట్విట్టర్ లో మహేష్ బాబు ఎవరిని ఫాలో అవ్వాలని అనుకుంటున్నారో తెలుసా…!

0

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా దర్శకుడు పరుశురాం మరియు హీరో మహేష్ బాబు ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు.తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ #whatshappening ట్రెండ్ లో పాల్గొన్నారు.ట్విట్టర్ లో మహేష్ బాబు అభిమానులు అడిగిన కొన్ని సింపుల్ ప్రశ్నలకు సమాధాం చెప్తూ ఒక వీడియొ ను పోస్ట్ చేసారు.ఈ వీడియోలో మొదటగా ఒక అభిమాని మీ గురించి మీరు ఒక్క మాట హాష్ ట్యాగ్ లో వివరించండి అని అడిగితె…కామ్ అండ్ ఫోకస్ అని సింపుల్ గా సమాధాం ఇచ్చారు.మరొక అభిమాని మీ డిఎమ్ లో వచ్చిన ఫన్నిస్ట్ మెసేజ్ ఏంటి అని అడిగినప్పుడు..అసలు నా డిఎమ్ లాక్ చేసి ఉంచాను..అది ఓపెన్ చేయాలా..?

అని తెలిపారు.మరొక అభిమాని ఓ ఎమోజి లో మిమ్మల్ని మీరు వివరించండి అని అడిగినప్పుడు…స్మైలీ ఎమోజి అని నవ్వుతు సమాధానం చెప్పారు మహేష్ బాబు.మరొక అభిమాని మీరు ట్విట్టర్ లో ఎవరినైనా ఒకరిని ఫాలో అవ్వాలి అని అనుకుంటే అది ఎవరిని అని అడిగారు.నా వైఫ్ నమ్రత ట్విట్టర్ లో ఉంటె బాగుండేది ఆమెను ఫాలో అయ్యేవాడిని అంటూ సమాధానం చెప్పారు మహేష్ బాబు.మరొక అభిమాని ట్విట్టర్ లో ఎడిట్ బటన్ ఉండాలా ఎస్ ఆర్ నో అని అడిగినప్పుడు బిగ్ ఎస్ అంటూ సమాధానం చెప్పారు మహేష్ బాబు.ఇక మరొక అభిమాని ఒక్కడు సినిమాలో ఎవరిని ఫాలో అవుతారు..మ్యూట్ చేస్తారు..బ్లాక్ చేస్తారు అని అడిగినప్పుడు..

mahesh babu twitter

స్వప్న పాత్రను ఫాలో అవుతాను,నా తండ్రి పాత్రను మ్యూట్ చేస్తాను,ఓబుల్ రెడ్డి పాత్రను బ్లాక్ చేస్తాను అని చెప్పుకొచ్చారు.ఇక మరో అభిమాని సర్కారు వారి పాట కోసం చెప్పండి అంటూ అడిగినపుడు నా అభిమానులు ఈ వేసవి లో ఒక బ్లాస్ట్ సినిమాను చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు.మరోవైపు ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ మరియు టీజర్ అన్ని కూడా ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలను పెరిగేలా చేస్తున్నాయి.ఈ సినిమా గురించి మాట్లాడిన మహేష్ బాబు సినిమా లో మొదటి 45 నిముషాలు వూగిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు.దింతో ఒక చిత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని సినిమా వర్గాలు చెప్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here