అమ్మాయిలలో బాగా క్రేజ్ ఉన్న ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న ఇప్పటి స్టార్ హీరో ఎవరో తెలుసా…

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది స్టార్ హీరోల మరియు హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ప్రతి రోజు కనిపిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు ఇదే క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరో అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా ఉన్న మహేష్ బాబు ను చూస్తే ఎవ్వరైనా యిట్టె గుర్తుపట్టగలరు.కృష్ణ వారసుడిగా ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మహేష్ బాబు ఆ తర్వాత రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

mahesh babu childhood pics

మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మహేష్ బాబు.ముఖ్యంగా అమ్మాయిలలో మహేష్ బాబు కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.మురారి,పోకిరి,వంశి,ఒక్కడు,నిజం,ఖలేజా,అతడు,శ్రీమంతుడు,సరిలేరు నీకెవ్వరూ ఇలా పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు.ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం లో మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.ఈ చిత్రం ఈ నెల మే 12 న థియేటర్లలో రిలీజ్ కానుంది.ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్నారు.

mahesh babu childhood pic

 

ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సర్కారు వారి పాట చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా టీజర్,పోస్టర్,సాంగ్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచుతున్నాయి.ఈ సినిమాకు సంబంధిచిన ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరగడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కానుందని సినీ వర్గాలు చెపుతున్నాయి.ఒకపక్క మహేష్ బాబు అభిమానులు కూడా తమ ఇష్టమైన హీరో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే ఇది ఇలా ఉంటె మహేష్ బాబు తర్వాతి సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *