సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత హీరో,హీరోయిన్ లుగా చేసిన వాళ్ళు చాల మందే ఉన్నారు.అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చాల మంది స్టార్ హీరో,స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు.తేజ సజ్జ వరుస సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు కుర్ర హీరోలుగా బాగానే రాణిస్తున్నారు.ఇదే క్రమంలో తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన నాని సినిమాలో బుడ్డోడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.టాలీవుడ్ లో చాల మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.
మహేష్ బాబు,అమీషా పటేల్ జంటగా నటించిన నాని సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ప్లాప్ టాక్ ను తెచ్చుకున్న హీరో మహేష్ బాబు కు మాత్రం నటుడిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.ప్లాప్ అయినా కూడా నాని సినిమా చాల మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది.మహేష్ బాబు కెరీర్ లోనే ఇది అత్యంత ప్రయోగాత్మకమైన చిత్రం అని చెప్పచ్చు.నాని చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.నాని చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించిన బుడ్డోడికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఆ బుడ్దోడే తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ వారసుడు అశోక్ గల్లా.అశోక్ గల్లా నటించిన హీరో అనే చిత్రం ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.హీరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నాని చిత్రాన్ని గుర్తు చేసుకున్నాడు అశోక్ గల్లా.చైల్డ్ ఆర్టిస్ట్ గా తానూ రెండు సినిమాలు చేసానని అందులో ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారితో చేసానని అశోక్ గల్లా తెలిపారు.కృష్ణ గారి సినిమాలో నటించినప్పుడు తనకు ఏమి తెలియదని కానీ నాని సినిమాలో చేసింది బాగానే ఐడియా వచ్చిందని చెప్పుకొచ్చారు.అప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరగడంతో చదువుకుంటున్న సమయంలోనే సినిమాలపై పూర్తి అవగాహనా తెచ్చుకున్నానని అశోక్ గల్లా తెలిపారు.