తన కెరీర్ లో ఇప్పటి వరకు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన 10 బ్లాక్ బస్టర్ సినిమాలు యేవో తెలుసా…

హీరో కృష్ణ వారసుడిగా రాజకుమారుడు చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు మహేష్ బాబు.తెలుగు ప్రేక్షకులలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరీ ముఖ్యంగా అమ్మాయిలలో అయితే మహేష్ బాబు కు చాల క్రేజ్ ఉందని చెప్పచ్చు.ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.అలాగే కొన్ని ప్లాప్ లు కూడా ఉన్నాయి.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు చాల సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు.అవి ఏంటంటే..

యమలీల:ఎస్ వి కృష్ణారెడ్డి యమలీల చిత్రం హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ సినిమాతోనే మహేష్ బాబు ను పరిచయం చేయాలనీ మొదట ఈ సినిమా కథను దర్శకుడు హీరో కృష్ణ గారికి వినిపించడం జరిగింది.కానీ చదువు డిస్టర్బ్ అవుతుందని భావించి ఈ సినిమాను వదులుకున్నారు.

నువ్వేకావాలి:ముందు స్రవంతి రవి కిషోర్ ఈ సినిమా కథను మహేష్ బాబు కు వినిపించారట.కాని మహేష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తరుణ్ ను ఫైనల్ చేసారు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఇడియట్:రవి తేజ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ఇడియట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అయితే ముందు ఈ సినిమా కథను నలుగురు హీరోలు రిజెక్ట్ చేయడం జరిగింది.ఆ నలుగురు హీరోలలో మహేష్ బాబు కూడా ఉన్నారు.ప్రేక్షకులు తనను ఇలాంటి పాత్రలో యాక్సెప్ట్ చేయలేరు అని భావించి మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.

లీడర్:రానా హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లీడర్ మంచి విజయం సాధించింది.అయితే ఈ సినిమా కథను కూడా శేఖర్ కమ్ముల ముందుగా మహేష్ బాబు కు వినిపించటం జరిగింది.అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని మహేష్ చెప్పడం జరిగింది.దానికి దర్శకుడు నో చెప్పడం తో మహేష్ బాబు తప్పుకున్నారు.

ఏమ్ మాయ చేసావే:మహేష్ బాబు కోసం గౌతమ్ మీనన్ తయారు చేసిన ఈ కథను మంజుల నిర్మించాలి అని అనుకున్నారు.కానీ అదే సమయంలో వేరే షూటింగ్ లలో బిజీగా ఉండడంతో మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.

24 :సూర్య నటించిన 24 సినిమా కథను విక్రమ్ కుమార్ మహేష్ బాబు కు వినిపించారు.కానీ కథలో కొన్ని మార్పులు చేయమని మహేష్ చెప్పడం జరిగింది.దాంతో హీరో సూర్య తో ఈ సినిమా చేసారు.

అఆ:ఈ సినిమాను త్రివిక్రమ్ మహేష్ బాబు తో చేయాలనీ అనుకున్నారు.కానీ ఆ సమయంలో మహేష్ డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో నితిన్ తో ఈ సినిమా చేసారు.

ఫిదా:ఈ సినిమా కథను కూడా డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో మహేష్ బాబు రిజెక్ట్ చేయడం జరిగింది.

గ్యాంగ్ లీడర్:ఈ చిత్రం కథను కూడా దర్శకుడు మహేష్ బాబు కు వినిపించారు.కానీ కొన్ని కారణాల వలన మహేష్ నో చెప్పడంతో నాని తో ఈ సినిమా చేసారు.

పుష్ప:ఈ కథను విన్న మహేష్ బాబు బాడీ ల్యాంగ్వేజ్,గెటప్ చేంజ్ చేస్తే చేద్దామని అన్నారట.అందుకు సుకుమార్ ఒప్పుకోకపోవడంతో మహేష్ నో చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *