సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి నటి నటులు చేసే పని మేకప్.హీరో,హీరోయిన్,క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎవరైనా సరే తెరిమీద కనిపించడానికి ఖచ్చితంగా మేకప్ వేసుకోవాల్సిందే అన్న విషయం తెలిసిందే.కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంత మంది హీరోలు మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు.అయితే సినిమా ఇండస్ట్రీలో కథకు తగినట్లుగా తమని తాము మార్చుకోవడానికి ఇష్టం లేని పనులు కూడా చేయక తప్పదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన ఒక సినిమా మేకప్ లేకుండానే చేసి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన అందంతో,నటనతో రాను రాను తండ్రికి మించిన ఫాలోయింగ్ ను క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.తాజాగా మహేష్ బాబు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు.

అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఒక సినిమా మేకప్ లేకుండా చేసారు అనే సంగతి చాల తక్కువ మందికే తెలుగు అని చెప్పచ్చు.అయితే ఈ సినిమా మాత్రం మహేష్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది అని చెప్పచ్చు.తేజ దర్శకత్వంలో ఇంచ్ మేకప్ కూడా వేసుకోకుండా మహేష్ బాబు చేసిన సినిమా నిజం.ఈ సినిమాలో మహేష్ బాబు న్యాచురల్ బుక్స్ తో పేస్ వాష్ చేసుకొని తెరపై కనిపించారట.కథ పరంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చిన కూడా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ప్లాప్ అయ్యింది.కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి గుర్తింపు వచ్చింది.ఇప్పటి వరకు మహేష్ తన కెరీర్ లో నిజం లో సినిమాలో తప్ప మిగిలిన అన్ని సినిమాలలో మేకప్ తో కనిపించారు.