Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన లేటెస్ట్ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో.అలాంటిది ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.మరోపక్క ఆల్ ఓవర్ బజ్ క్రియేట్ చేసిన మహేష్ బాబు,( Mahesh Babu ) జక్కన్న రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియనుంది.ఈ న్యూస్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ యాక్షన్ థ్రిల్లర్ లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ట్రిపుల్ ఆర్ కు ముందే ప్లాన్ చేసారు.తన తండ్రి అయినా విజయేంద్ర ప్రసాద్ తో కథను ఫైనల్ చేయించుకొని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నారు.షూటింగ్ డేట్ ఫిక్స్ అనే వార్తతో అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి.మహేష్ బాబు బర్త్ డే ఆగష్టు 9 న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారట రాజమౌళి.మహేష్ ఫ్యాన్స్ ను ఆనందింప చేస్తూ మహేష్ బాబు బర్త్ డే రోజే ఈ మూవీ షూట్ ను లాంచ్ చేస్తున్నారట రాజమౌళి.అదే రోజు ఒక అఫిషియల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారట రాజమౌళి.