ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర కోసం మొదట ఫైనల్ అయినా స్టార్ హీరో ఇతనే…కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే…

మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ఆచార్య ఏప్రిల్ 29 న విడుదల అయ్యింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రను తీసేశామని ఇప్పటికే ఆచార్య మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.మెగా మల్టీస్టారర్ గా నిలిచినా ఆచార్య చిత్రంలో సిద్ధ పాత్ర కోసం మొదట అనుకున్న హీరో మహేష్ బాబు.అయితే మొదట దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర గురించి మహేష్ బాబు కు వినిపించటం జరిగింది.ఈ పాత్ర చేయడానికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పారు.ఆ తర్వాత చిరంజీవి భార్య సురేఖ కోరిక మేరకు రామ్ చరణ్ సిద్ధ పాత్ర కోసం ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఇక హీరో మహేష్ బాబు కూడా సిద్ధ పాత్రలో రామ్ చరణ్ నటించడానికి ఓకే చెప్పి సన్నిహితంగా ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.ఇలా ఈ సినిమా లో సిద్ధ పాత్ర కోసం ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నాయి అని చెప్పచ్చు.ఒకవేళ రామ్ చరణ్ కు బదులుగా మహేష్ బాబు ఆచార్య సినిమాలో చేసి ఉన్న ఇదే స్థాయిలో భారీగా అంచనాలు నెలకొనేవి.అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఆచార్య సినిమా రిలీజ్ అయినా రెండు వారాల తర్వాత సర్కారు వారి పాట రిలీజ్ కానుంది.ఆచార్య మరియు సర్కారు వారి పాట రెండు సినిమాలు కూడా హిట్ సాధించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.అయితే ఆచార్య సినిమాను డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో హిందీలో విడుదల చేయడం లేదని రామ్ చరణ్ ఇప్పటికే చెప్పడం జరిగింది.అయితే రాబోయే కొన్ని రోజుల్లో హిందీలో కూడా ఆచార్య సినిమా విడుదల అవుతుందని రామ్ చరణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *