ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది.పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12 న విడుదల అయ్యి సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ SSMB 28 గా రాబోతున్న ఈ చిత్రానికి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.త్రివిక్రమ్ తన పాత చిత్రాల సెంటిమెంట్ ఫాలో అవుతూ టైటిల్ ను నిర్ణయించనున్నారని సమాచారం.మాటల మాంత్రికుడికి అ అక్షరం అనే సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే.ఆయన సినిమాలు అతడు,అత్తారింటికి దారేది,అ ఆ,అరవింద సమేత వీరరాఘవ,అల వైఖుంతపురములో సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అందుకే అ అక్షరం కలిసి వచ్చేలా ఈ చిత్రానికి అర్జునుడు అనే టైటిల్ పెడుతున్నారట.ఇదివరకు మహేష్ బాబు గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ అనే టైటిల్ తో సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రం పర్వాలేదు అని పించింది.మల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ బాబు అర్జునుడు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు.ఇది క్యాచీ టైటిల్ పవర్ ఫుల్ టైటిల్ అని తెలుస్తుంది.మహేష్ బాబు తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు మే 31 న ఈ సినిమా టైటిల్ మరియు లోగో ప్రకటించనున్నారని సమాచారం.తన కుటుంబం కోసం ప్రత్యర్థుల్ని ఎలా గడగడలాడించాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది సమాచారం.ఇక ఈ చిత్రం అతడు,ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం.