ఈ మహిళలు స్టీరింగ్ పట్టి ఆటో నడపడానికి వెనుక ఉన్న కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు….

ఇంట్లో ఏదైనా పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఏదైనా కూలీపనికి వెళ్లిన కూడా వచ్చే డబ్బులు కుటుంబాన్ని పోషించటానికి సరిపోకపోవడంతో ఆటో నడపడం ప్రారంభించారు నలుగురు మహిళలు.వివరంగా చెప్పాలంటే…కరీంనగర్ లోని గోదావరి ఖని లో నలుగురు మహిళలు ఆటో నడవడం మొదలుపెట్టారు.వారిలో ఇద్దరు మున్సిపల్ పారిశుధ్య వాహనాలు నడుపుతున్నారు.మరొక ఇద్దరు ఆటో నడిపి జీవితాన్ని సాగిస్తున్నారు.కరీంనగర్ లోని సుభాష్ నగర్ కు చెందిన రెడ్డి మల్ల సంగీత మొదట ఆటో నడిపిన మహిళా గా గుర్తింపు తెచ్చుకుంది.

సంగీతకు చిన్న వయస్సులోనే రాజు అనే వ్యక్తి తో వివాహం జరిగింది.ఆ తర్వాత కూతురు పౌర్ణమి పుట్టిన కొద్దీ రోజులకే రాజు చనిపోవడం జరిగింది.ఏ పని చేసి జీవితం కొనసాగించాలి తెలియని పరిస్థితిలో ఇంట్లో మామ,మరిది ఆటో నడపడం చూసి తానూ కూడా ఆటో నడిపి జీవితం సాగించాలి అని అనుకుంది.అనుకున్నట్లుగానే ఆటో నడపడం నేర్చుకొని ఆటో ను అద్దెకు తీసుకోని ఆటో నడపటం మొదలుపెట్టింది.

ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆటో నడిపేది.వచ్చిన 600 రూపాయల్లో 300 అద్దెకు పొగ మిగిలిన డబ్బుతో తన కూతురిని చదివించడం,కుటుంబాన్ని పోషించటం వంటివి చేసేది.అలాగే నిర్మల అనే మహిళకు సాగర్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది.వీరిది పేద కుటుంబం కావడం వలన ఇద్దరు పనిచేస్తేనే కానీ పూట గడిచేది కాదు.దింతో కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో లు ఇస్తున్నారని తెలుసుకొని తానె ఆటో నడపాలని అనుకుంది నిర్మల.ఆమెకు ఆటో కూడా మంజూరు కావడంతో భర్తకు తోడుగా ఆటో నడుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *