ఆ సినిమా కోసం క్యూ లో నుంచొని టికెట్ తీసుకున్న మహేష్ బాబు..వీడియొ వైరల్…

తాజాగా శశి కిరణ్ దర్శకత్వంలో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్.26 /11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్ కు సరికొత్తగా చేస్తున్నారు.సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రేక్షకులకు తమ సినిమా గురించి తెలిసేలా డిఫరెంట్ గా ప్రొమోషన్ చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్.ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినా ట్రిపుల్ ఆర్,కెజిఎఫ్ 2 ,సర్కారు వారి పాట,ఎఫ్ 3 వంటి చిత్రాలకు హీరో,హీరోయిన్లతో పాటుగా చిత్ర యూనిట్,డైరెక్టర్లు కూడా సినిమా ప్రమోషన్స్ చేసారు.తాజాగా తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా ప్రొమోషన్ లో భాగంగా మహేష్ బాబు సినిమా టికెట్ కోసం క్యూ లో నిలబడ్డారు.ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్యూ లో నుంచొని టికెట్ తీసుకుంటున్న వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు తన సొంత బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్,సోనీ పిక్చర్స్ ఫిలిం సంస్థలతో కలిసి నిర్మించడం జరిగింది.తెలుగుతో పాటు మలయాళం,హిందీ బాషలలో ఈ చిత్రం జూన్ 3 న థియేటర్లలో విడుదలకు సిద్ధం గా ఉంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ బాబు ఒక సినిమా థియేటర్ ముందు టికెట్ కోసం క్యూ లో నుంచొని యూట్యూబర్,డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ ఏం తో కలిసి సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసారు.ఈ వీడియొ లో నిహారిక సినిమా టికెట్ కోసం థియేటర్ ముందు క్యూ లో నిలబడి ఉంటుంది.

major movie promotion funny vedio goes viral
Mahesh Babu

నిహారిక ముందు ఒకరి తర్వాత ఒకరు వచ్చి క్యూ లో నిలబడతారు.ఇదే క్రమంలో హీరో అడవి శేష్ కూడా వచ్చి నిహారిక ముందు నిలబడటంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.ఈలోపు నిహారిక ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి నిలబడతారు.మహేష్ ను చూడగానే నిహారిక చాల త్రిల్ గా ఫీల్ అవుతుంది.మా ఫ్రెండ్స్ ను కూడా పిలవచ్చా అని మహేష్ బాబు అడగగానే ఓకే చెప్తుంది నిహారిక.దాంతో క్యూ లైన్ మరింతగా పెరిగిపోతుంది.నిహారిక మహేష్ బాబు ఫోన్ నెంబర్ అడిగి తీసుకునే లోపే అక్కడ నుంచి మహేష్ వెళ్ళిపోతారు.ఆ తర్వాత అడవి శేష్ ను అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది నిహారిక.చాల డిఫరెంట్ గా సినిమా ప్రొమోషన్ కోసం చేసిన ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *