ప్రతి ఒక్కరు నివసించే ఏరియా లో కూరగాయల మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది కదా.చాల మంది ప్రతిరోజూ కూరగాయల మార్కెట్ కు వెళ్లి ఫ్రెష్ గా ఉండే కూరగాయలను కొని తెచ్చుకుంటారు.ఫ్రెష్ గా తక్కువ ధరకే ఉండే కూరగాయలను చాల మంది ఎప్పటికప్పుడు ప్రతిరోజూ కొని తెచ్చుకుంటారు.ఇటువంటి మార్కెట్ లలో కొంత మంది వ్యాపారాలు మోసం చేస్తుంటారు.వాళ్ళు మోసం చేస్తున్నారు అనే సంగతి ఎవరు కనిపెట్టలేరు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా నమ్మలేరు.
ఈ వీడియొ లో ఒక అమ్మాయి స్కూటీ మీద వచ్చి ఆపిల్స్ కొనడానికి ఆగింది.అతను ఆ అమ్మాయి ఇచ్చిన ఆపిల్స్ ను ప్యాక్ చేసినట్లుగా చేసి ఆ తర్వాత ముందుకు వంగి తానూ ముందే పాడైపోయిన ఆపిల్స్ ప్యాక్ చేసిన కవర్ ను ఇవ్వడం గమనించవచ్చు.ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయినా తర్వాత ఆ ఆపిల్స్ ఉన్న ప్యాకెట్ తీసి ఆపిల్స్ సర్దడం మీరు కూడా చూడవచ్చు.
ఈ వీడియోలో ఒక షాప్ లో ఉన్న వ్యక్తి న్యాయంగా తూకం వేస్తున్నట్లు వేసి పక్కన అతను ఉంచిన పండ్లను తెలివిగా కింద పడేస్తున్నాడు.కస్టమర్ కు ముందు ఎక్కువగా సామాను ఉండడంతో అతనికి అక్కడ ఏం జరుగుతుందో కనిపించడం లేదు.కస్టమర్ డబ్బులు మొత్తం ఇచ్చేసిన తర్వాత తానూ మోసపోయినట్లు తెలియక తక్కువ పండ్లనే ఇంటికి తీసుకెళ్లాడు.