పెళ్లి మండపంలో ఒకే సమయంలో ఇద్దరు అక్కచెల్లెళ్లకు తాళి కట్టిన వరుడు…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

NEWS DESK
1 Min Read

మహారాష్ట్ర లో ఒక అరుదైన సంఘటన జరిగింది.పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు.ఈ అరుదైన సంఘటన మహారాష్ట్ర లోని అక్లూజ్ లో జరిగింది.అతుల్ అనే పెళ్లి కొడుకు రింకీ,పింకీ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు.కవల పిల్లలుగా పుట్టిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే స్కూల్ లో చదువుకున్నారు.ఆ తర్వాత ఒకే కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముంబై లోని కందివాళిత్ లో నివాసం ఉంటున్నారు.

తండ్రి లేకపోవడంతో తల్లి తో కలిసి ఇద్దరు అక్కాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారు.వీరిద్దరూ అంధేరి లోని ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు.ఒకరోజు ఇద్దరు అనుకోకుండా అస్వస్థతకు గురిఅవడంతో అతుల్ వాళ్ళను హాస్పిటల్ లో చేర్పించాడు.

man married two womens in maharashtra at a time

మగదిక్కులేని వాళ్ళ కుటుంబానికి అతుల్ దగ్గర అవడంతో ఆ ఇద్దరి అమ్మాయిలలో ఒకరు అతుల్ ను ఇష్టపడ్డారు.ఆ ఇద్దరు కవల పిల్లలు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోవడంతో ఇద్దరు అతుల్ ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు.వీరిద్దరూ తీసుకున్న నిర్ణయానికి అతుల్ మరియు అతని కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో ఒకే సమయంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు అతుల్.ఇలా ట్విన్స్ అయినా వీరిద్దరూ ఒకడినే పెళ్లి చేసుకున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *