మెగాస్టార్ పాటకు మంచు లక్ష్మి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే….వీడియొ వైరల్…


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా మంచు ఫ్యాన్స్ మధ్య తరచుగా మాటల యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది.ఈ రెండు కుటుంబాలు కూడా సన్నిహితంగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది.అయితే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మాత్రం మొత్తం మారిపోయిందని చెప్పచ్చు.మెగా వెర్సెస్ మంచు అనేలా మారిపోయింది.అప్పటి నుంచి ప్రతి చిన్న విషయంపై కూడా ఇరువర్గాల ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్లాప్ అయినా తర్వాత మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే ఆచార్య సినిమా ప్లాప్ తర్వాత కూడా మంచు అభిమానులు విమర్శలు చేసారు.ఇది ఇలా ఉంటె తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి మాస్ సాంగ్ బాస్ పార్టీ సాంగ్ ను విడుదల చేసారు సినిమా యూనిట్.ఈ సాంగ్ కు సామాన్యుల నుంచి సినిమా సెలెబ్రెటీల వరకు స్టెప్పులు వేసి సందడి చేస్తున్నారు.ఇదే సాంగ్ కు మంచు లక్ష్మి జబర్దస్త్ ఫెమ్ మహేష్ తో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది.

మెగాస్టార్ పాటకు మంచు లక్ష్మి చేసిన డాన్స్ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు డాన్స్ చేయడం ఎప్పుడు సంతోషమే అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్నారు.మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.ఈ సినిమా పాటలు కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించడం జరిగింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *