తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మరియు నిర్మాత అయినా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు మనోజ్.ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఈయన గత కొంత సమయం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కూడా మళ్ళి త్వరలోనే రీ ఎంట్రీ కి సిద్ధం గా ఉన్నారు.

ఇక మంచు మనోజ్ 2017 సంవత్సరంలో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.కొంత సమయం వరకు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు.అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటున్నారు మంచు మనోజ్.
ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పేరు ప్రఖ్యాతలు ఉన్నఫ్యామిలీ కి చెందిన అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పేరు ప్రఖ్యాతలు గాంచిన దివంగత నేత భూమా నాగిరెడ్డి,శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె అయినా మౌనిక రెడ్డి తో మనోజ్ వివాహం జరగనుందని సమాచారం.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వీరి రెండవ కుమార్తె తో మనోజ్ వివాహం జరగనుందని వార్తలు రావడమే కాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతుండడంతో వీరి వివాహం జరగబోతుంది అనే వార్త సోషల్ మీడియా లో ఊపందుకుంది.ఈ విషయం తెలుసుకున్న మనోజ్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.