మంచు విష్ణు కథానాయకుడిగా చేసిన రీసెంట్ మూవీ ‘జిన్నా’ ఇందులో శృంగార తార సన్ని లియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్ గా చేశారు. న్యూ డైరెక్టర్ సూర్య తీసిన ఈ సినిమా మోహన్ సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ పై వచ్చింది. మోహన్ బాబే స్వయంగా స్క్రీన్ ప్లే కూడా చేశారు.ఈ చిత్రం విడుదలై గురువారంతో మొదటి వారం పూర్తయింది.
మంచు ఫ్యామిలీ ప్రభావం వెండితెరపై రోజు రోజుకూ తగ్గిపోతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం హీరోగా మోహన్ బాబు నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రేక్షకులు దీనిని చూసేందుకు కనీసం ఆసక్తి చూపలేదు. దీంతో మోహన్ బాబు తన కెరీర్ లో, టాలీవుడ్ ఇండస్ర్టీలో కూడా ఈ సినిమా తక్కువ వసూలు చేసి రికార్డులకు ఎక్కింది.
ఇదే సీన్ మంచు విష్ణు చిత్రం ‘జిన్నా’ కంటిన్యూ చేశారని ఇండస్ర్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలుగా ఏదైనా మూవీకి ఫ్లాప్ టాక్ వస్తే దాని ప్రభావం కలెక్షన్స్ పై ఉంటుంది. ఇక్కడ కొంచెం రివర్స్ అయ్యింది. సినీ అభిమానుల్లోకి జిన్నా టాక్ బాగానే వెళ్లినా ఫిలిం మాత్రం వసూళ్లను సాధించలేకపోయింది. ఏది ఏమైనా ‘మంచు’ ఫ్యామిలీకి సినిమా పరంగా కొన్ని బ్యాడ్ డేస్ నడుస్తున్నాయన్న వార్తలు టాలీవుడ్ లో బాహాటంగానే వినిపిస్తున్నాయి.