మంగళవారం రోజున బార్బర్ షాపులు ఎందుకు మూసి ఉంటాయి…ఆ రోజున హెయిర్ కటింగ్ ఎందుకు చేయించుకోరో తెలుసా…


చాల మంది మంగళవారం రోజున హెయిర్ కట్ చేయించుకోకూడదు అని చెప్తుంటారు.అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం ఖచ్చితంగా మంగళవారం రోజున హెయిర్ కట్ కానీ లేక గోర్లు కత్తిరించటం కానీ చేయకూడదు అని పాటిస్తారు.అందుకే మంగళవారం రోజున హెయిర్ కట్ చేసే షాప్స్ అన్ని కూడా మూసి ఉంటాయి.మంగళవారం రోజున బార్బర్లు అందరు కూడా హాలిడే అంటూ రెస్ట్ తీసుకుంటారు.అయితే ఇలా మంగళవారం రోజున హెయిర్ కట్ చేయించుకుంటే కొన్ని చెడు సంకేతాలు కలుగుతాయి అని చాల మంది నమ్ముతారు.

అయితే ఆ రోజున ఎందుకు హెయిర్ కట్ చేయించుకోకూడదో వాటికీ సంబంధించిన కారణాలు చాల మందికి తెలిసి ఉండవు.అలా ఆ రోజున హెయిర్ కట్ చేయించుకోకపోవడానికి వెనుక బలమైన కారణం ఉండనే చెప్పచ్చు.మంగళవారం లో మంగళవార్ అంటే మంగళ గ్రహం.దానినే మార్స్ గ్రహం అని కూడా అంటారు.దానినే అంగారక గ్రహం మరియు అరుణ గ్రహం అని కూడా పిలుస్తుంటారు.అయితే అంగారక గ్రహానికి మరియు మానవ శరీరానికి సంబంధం ఉంటుంది అని విశ్వసిస్తారు.

అంగారక గ్రహం అనేది ఎరుపు రంగుకు ప్రతీక.ఆ రోజున హెయిర్ కట్ లేదా గోర్లు కత్తిరించటం వలన మానవ శరీరంలోని బ్లడ్ మీద ప్రభావం పడుతుంది అని చెప్తుంటారు.మానవ శరీరం పైన గాట్లు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది.అందుకే అనవసరమైన ఇబ్బందులు ఎందుకు అని ఆ రోజున హెయిర్ కట్ మరియు గోర్లు కత్తిరించుకోరు చాల మంది.మంగళవారం రోజున అంగారక గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రోజున హెయిర్ కటింగ్,షేవింగ్ మరియు గోర్లు కత్తిరించుకోకూడదను అని నమ్ముతారు చాల మంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *