Masooda: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోను ఎక్కడ చూసిన మసూద సినిమా పేరే బాగా వినిపిస్తోందని చెప్పచ్చు.హారర్ జోనర్ లో వచ్చే సినిమాలకు చాల మంది అభిమానులు ఉన్నారు.లారెన్స్ వంటి వారు హారర్ జోనర్ కాంచన సిరీస్ తీయడానికి కూడా ఇదే కారణం అని చెప్పచ్చు.అయితే ప్రస్తుతం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మసుద సినిమా ప్రేక్షకులను వణికిస్తుంది.చాల కాలం తర్వాత హారర్ జోనర్ వచ్చిన మసూద సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.మొదట ట్రైలర్ మీదే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత పబ్లిక్ టాక్ ను బట్టి ఈ సినిమా అనుకున్ననట్టే అంచనాలను అందుకుంది తెలుస్తుంది.
ఈ సినిమా హిట్ టాక్ తో మొదట కంటే ఇప్పుడు థియేటర్ల సంఖ్యా ఇంకా పెరిగిందని సమాచారం.ఇక ఈ సినిమాలో నీలం అంటే సంగీత,నజియా అంటే భాంధవి అనే తల్లి కూతుర్లది మధ్య తరగతి కంటే తక్కువ కుటుంబం ఉంటుంది.వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోయినా కూడా ఎంతో సంతోషంగా అద్దె ఇంట్లో ఉంటారు.ఎన్ని కష్టాలు వచ్చిన అవి మాకు మాములే అని సర్దుకుపోతుంటారు.ఇలా వాళ్ళు ఆనందంగా జీవిస్తున్న సమయంలో నజియా ప్రవర్తనలో మార్పు వస్తుంది.ఆమెకు దెయ్యం పట్టినట్లు అనిపిస్తుంది అందరికి.పొరుగింటి గోపి సహాయంతో నజియా ఎందుకు ఇలా చేస్తుంది అని ప్రయత్నాలు చేసే క్రమంలో వాళ్ళు మసూద గురించి తెలుసుకోవడం జరుగుతుంది.
ఇక మసూద అనేది ఎవరు అనేది మిగిలిన కథాంశం.ఈ సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర అయినా మసూద పాత్రను సినిమాలో బురఖా లోనే చూపించడం జరుగుతుంది.అయితే ఇటీవలే జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో మసూద ను చూపించడం జరిగింది.ఈ పాత్ర చేసిన ఆ అమ్మాయి పేరు అఖిల రామ్.అఖిల హిందీ లో లిఫ్ట్ 8055 అనే సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది.మసూద సినిమాలో బురఖా పాత్రలో ఉన్న అమ్మాయిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు దర్శకుడి మీద ఆగ్రహంగా కూడా ఉన్నారు.ఇంత అందమైన అమ్మాయిని బురఖా వేశారెందుకు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.