జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాల మంది అరచేతిలో రేఖలు తమ జీవితాన్ని నిర్దేశించేవి అని నమ్ముతుంటారు.అయితే చాల మంది అర చేతుల్లో x అనే గుర్తు ఉంటుంది.ఇలా ఈ గుర్తు అర చేతుల్లో ఉన్న వాళ్ళ చేతుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చాల ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది.మాస్కో లోని ఎస్టీఐ లో శాస్త్రవేత్తలు చాల మంది x గుర్తు ఉన్న చేతులను పరిశోధన చేయడం జరిగింది.వాళ్లలో వ్లాదిమిర్ పుతిన్,అబ్రహం లింకన్ కూడా ఉన్నారు.అయితే అలెగ్జాన్డర్ కు కూడా తన అరచేతి మీద ఈ గుర్తు ఉండడంతో ఆయన ప్రపంచాన్ని జయించగలిగారు.
ఐతే ఇలా అరచేతుల్లో ఆ గుర్తు ఉండడం వలన వాళ్ళు అత్యంతప్రతిభావంతులు ఏ ప్రణాళిక లేకుండానే విజయాన్ని సాధించగలరు అని పరిశోధనలో తేలింది.అయితే చేతుల్లో ఆ గుర్తు ఉన్న వాళ్ళు ఇతరులను కూడా విజయపథంలో నడిపించగలరు అని చెప్తున్నారు.ఇలా అరచేతుల్లో ఆ గుర్తు ఉన్నవారు విజయాలు సాధించాలి అని అనుకోకపోయిన కూడా విజయాలు వారినే వరిస్తాయి అని చెప్తున్నారు నిపుణులు.
ఎదుటి వారిని కూడా అంచనా వేసే సామర్ధ్యం,ప్రతిభ అలంటి వారిలో ఉంటాయట.ఇలాంటి వారిని మోసం చేయడం కష్టమేనట.ఎలాంటి వారు శారీరకంగా మరియు మానసికంగా చాల బలవంతులు గా ఉంటారట.అంటూ రోగాలు కూడా వీరి దారికి చేరవు అని చెప్తున్నారు నిపుణులు.వీరు ఇతరుల జీవితాలలో కూడా మార్పును తీసుకురాగలరు అని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.తమ ప్రతిభతో విజయాన్ని సాధించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించగలరు అని చెప్తున్నారు నిపుణులు.