Home » ఆరోగ్యం » అన్ని ఆరోగ్య సమస్యలకు అమృతంలా పనిచేసే మేకపాలు..ప్రయోజనాలు ఇవే..!

అన్ని ఆరోగ్య సమస్యలకు అమృతంలా పనిచేసే మేకపాలు..ప్రయోజనాలు ఇవే..!

చాల మంది గేదె పాలు తాగుతారు.అలాగే ఆవు పాలు కూడా తాగేవాళ్ళు కూడా చాల మంది ఉంటారు.అయితే ఆవుపాలు మరియు గేదె పాలు కంటే కూడా మేక పాలు ఆరోగ్యానికి చాల మంచిది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.మేక పాలలో పొటాషియం,మెగ్నీషియం,ప్రోటీన్లు,కొవ్వులు,కాల్షియం,విటమిన్లు,కాపర్,జింక్ ఇలా చాల మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.మేక పాలు చాల సులభంగా జీర్ణం అవుతాయి.అందుకే జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు మరియు చిన్న పిల్లలు రోజు ఒక కప్పు మేక పాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెపుతున్నారు నిపుణులు.

ఇటీవలే తాజాగా మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో మేక పాలను విక్రయించడానికి డైరీలను నెలకొల్పడం జరిగింది.మేక పాలు రోగ నిరోధక శక్తి పెరగడంలో కూడా తోడ్పడతాయి.మేక పాలలో చాల చిన్న కొవ్వుకణాలు ఉండడం వలన అవి చాల సులువుగా జీర్ణం అవుతాయి.శరీరానికి అధిక శక్తిని సమకూరుస్తాయి దింతో కొవ్వు కణాలు కూడా నిల్వ ఉండవు.దాంతో శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉండదు.ఈ మేక పాలు పేగుకు సంబంధించిన వ్యాధులు మరియు కరోనరీ వ్యాధులకు చికిత్స లో కూడా చాల చక్కగా పని చేస్తాయి.

చేదు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు నియంత్రించడంలో కూడా మేక పాలు బాగా ఉపయోగపడతాయి.ఇంకా మలబద్దకం,ఉబ్బరం వంటి సమస్యలకు బాగా పని చేస్తాయి ఈ మేక పాలు.డెంగ్యూ వంటివి రాకుండా రక్తంలో ప్లేట్లెట్ లను కూడా విపరీతంగా పెరిగేలా చేస్తాయి.చక్కర అలర్జీ మరియు లాక్టోస్ అసహనం వంటివి ఉన్న వారికీ మేక పాలు చాల శ్రేష్టం.మేకపాలులో ఉండే ఎ 2 అనే ప్రోటీన్ శరీరాన్ని అలెర్జీ,పెద్ద పేగు వ్యాధులు మరియు చిరాకు వంటి వాటి నుంచి కాపాడగలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *