ఎవరు మిలో కోటీశ్వరులు షోలో రాజా రవీందర్ గెలిలీచింది కోటి…కానీ చేతికి వచ్చేది ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

బుల్లితెర మీద ప్రసారం అయ్యే రియాలిటీ షో లలో జెమినీ టీవీ లో ప్రసారం అయ్యే మిలో ఎవరు కోటీశ్వరులు షో కూడా ఒకటి.సామాన్యుడిని సైతం కోటీశ్వరుడిని చేసే షో మిలో ఎవరు కోటీశ్వరులు అంటూ ఈ షో ప్రారంభంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ చెప్పడం జరుగుతుంది.అయితే ఈ షో లో ఇప్పటి వరకు ఎవరు కూడా కోటి రూపాయలు అయితే గెలవాడు.ఇతర వేరే భాషలలో ప్రసారం అయ్యే ఇలాంటి షోలలో కొంత మంది కోటి రూపాయలు గెలిచినవాళ్లు ఉన్నారు.తెలుగులో ప్రసారం అయ్యే ఎవరు మిలో కోటీశ్వరులు షోలో ఇటీవలే రాజా రవీందర్ అనే కొత్తగూడెం కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కోటి రూపాయలు గెలుచుకున్నారు.

ఒక సామాన్యుడు కోటి రూపాయలు గెలుచుకోవడంతో ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలలోను ఎక్కడ చుసిన మిలో ఎవరు కోటీశ్వరులు షో గురించి మరియు సబ్ ఇన్స్పెక్టర్ అయినా రాజా రవీందర్ గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.రాజా రవీందర్ బీటెక్ చదివి ఆ తర్వాత 2012 సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాన్ని సాధించారు.ఇప్పుడు ఎవరు మిలో కోటీశ్వరులు షోలో కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటిరూపాయలు గెలవడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోను మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

చాల మంది ప్రేక్షకులలో కోటి రూపాయలు గెలిచారు కానీ చేతికి యెంత వస్తాయో అనే అనుమానం ఉంది.అయితే ఇలాంటి రియాలిటీ షోలలో గెలిచినా తర్వాత వచ్చే డబ్బుపై ఐటి యు /ఎస్ 194 బి చట్టం ప్రకారం 31.2 % పన్ను చెల్లించాలి.తాజాగా రాజా రవీందర్ గెలిచినా కోటి రూపాయలలో 31. 2 % పన్ను అంటే 31,20,000 పన్ను చెల్లించగా మిగిలిన 68,80,000 వస్తాయి.పన్ను చెల్లింపుకు సంబంధిచిన వ్యవహారం మొత్తం కూడా ఈ షో నిర్వాకులు చూసుకుంటారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *