మొదట అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా చిరంజీవి సినిమా ఏదో తెలుసా…

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చిరంజీవి సినిమా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి మహేశ్వరీ పరమేశ్వరి బ్యానర్ పై సుబ్బరామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ అనే చిత్రం.బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన భాను ప్రియా మరియు రాధా హీరోయిన్లుగా నటించారు.1989 మార్చ్ 23 న ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదట్లో ఈ చిత్రం ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టించింది.అప్పట్లో ఈ చిత్రంలో నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లను రాబట్టడం జరిగింది.చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ అనే చిత్రం విడుదల అయినా టైములో అమితాబచ్చన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఉన్నారు.ఆ టైం లో అమితాబచ్చన్ సినిమాలకు మించి చిరంజీవి సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం.

అదే టైములో ట్రేడ్ గైడ్ అనే మ్యాగజైన్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ కలెక్షన్ల వివరాలను ప్రచురించి వేర్ ఇస్ అమితాబ్? అని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ విడుదల చేసింది.ఆర్టికల్ చదివిన హిందీ ప్రముఖులు వేర్ ఇస్ అమితాబ్ అనే మాటను చదివి ఆశ్చర్యపోవడం జరిగింది.స్టేట్ రౌడీ చిత్రం వంద రోజుల వేడుకను ఘనంగా జరుపుకొని చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *